T20 World Cup 2021: South Africa vs West Indies – Pitch Report, Predicted XI and Match Prediction
#T20WorldCup2021
#SouthAfricavsWestIndies
#SAvsWILiveScore
#AndreRussell
#KieronPollard
#Rabada
టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12 మ్యాచ్‌ల్లో భాగంగా ఈరోజు (అక్టోబర్ 26) డబుల్ హెడర్స్ జరగనున్నాయి. తొలి మ్యాచులో గ్రూప్-1లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోయాయి. వెస్టిండీస్‌ను ఇంగ్లండ్ ఓడించగా.. దక్షిణాఫ్రికాను ఆస్ట్రేలియా ఓడించింది. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. విజయం సాధించిన జట్టే సెమీస్ దిశగా అడుగు వేయనుంది. దాంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.